apollonews.in Blog ఆరోగ్యం రంజాన్ స్పెషల్..దహీ చనా ఇలా చేసుకుంటే శరీరానికి కొత్త శక్తి,పూర్వీకుల్లా బలంగా ఉండొచ్చు
ఆరోగ్యం

రంజాన్ స్పెషల్..దహీ చనా ఇలా చేసుకుంటే శరీరానికి కొత్త శక్తి,పూర్వీకుల్లా బలంగా ఉండొచ్చు

ఈ ఏడాది మార్చి 2 నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు నెల రోజుల పాటు ఉపవాసం ఆచరించి నియమ నిబంధనలు పాటించి అల్లాని ప్రార్థిస్తారు. ఇస్లాం మతం ఆచారాల ప్రకారం ఉపవాస దీక్షను విరమించడానికి, ఉపవాస దీక్ష ప్రారంభించే ముందు సెహ్రీ, ఇఫ్తార్ నిర్వహిస్తారు. ఇఫ్తార్ విందులో భాగంగా రంజాన్ స్పెషల్ దహీ చనా తింటే అద్భుతమైన రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. శెనగలతో తయారుచేసే దహీ చనాలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన ఇది ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది.ఇది శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది.

దహీ చనాలో వాడే కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరలు శరీరానికి విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. ఈ వంటకంలో వాడే మసాలా దినుసులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. రంజాన్ సమయంలో దహీ చనా లాంటి పోషకమైన ఆహారాలు తీసుకోవడం వలన శరీరం శక్తివంతంగా ఉంటుంది. దహీ చనా ఇంట్లో తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

Exit mobile version