Maha Kumbh Mela Night View Pics From Space: ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా గురించి ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశం నలుమూలల నుంచే కాకుండా ఆ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు అనేక మంది విదేశీయులు కూడా వస్తున్నారు. ఈక్రమంలోనే కుంభమేళాకు చెందిన ఎన్నెన్నో ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా కుంభమేళాకు చెందిన కొన్ని ఫొటోలు నెట్టింట రచ్చ లేపుతున్నాయి. ముఖ్యంగా కుంభమేళాను.. అర్ధరాత్రి అది కూడా అంతరిక్షం పైనుంచి చూస్తే ఎలా ఉంటుందో చూపించాడో వ్యోమగామి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓసారి ఆ ఫొటోలను చూసి ఎంజాయ్ చేసేయండి.
Leave a Comment